ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ ఉన్నత, సాంకేతిక విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ప్రజలకు సోమవారం వెరైటీ సూచన చేశారు. పెళ్లి చేసుకోకుండా తనలా బ్రహ్మచారిగా ఉండాలని పేర్కొన్నారు. సింగిల్స్ ఉద్యమంలో చేరండని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ స్పందనను తెలిపారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. ‘జనాభా పెరుగుదల సమస్య పట్ల వివేకంతో ఉందాం. పిల్లలను కనడంపై తెలివిగా ఆలోచిద్దాం.. లేదా నాలాగా సింగిల్‌గా ఉండండి. ఈ రోజే సింగిల్స్ ఉద్యమంలో చేరండి. సుస్థిరమైన భవిష్యత్తుకోసం మనమందరం కలిసి పనిచేద్దాం’ అని టెమ్జెన్ ట్వీట్ చేశారు. నాగాలాండ్ మంత్రి ట్వీట్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. ‘నాగాలాండ్ విద్యా మంత్రి ఇమ్నా వాస్తవానికి వివాహానికి వ్యతిరేకం కాదు..కానీ అతను తన సమూహం సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఈ విధంగా వ్యాఖ్యానించారు.’ అని రిజిజు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఆయన రైజింగ్ స్టార్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని ఒకరు ట్వీట్ చేయగా, ‘నేను ఇక ఒంటరిగా ఉన్నందుకు సిగ్గుపడను.. గర్వంగా ఫీలవుతాను’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing.
Or #StaySingle like me and together we can contribute towards a sustainable future.
Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr
— Temjen Imna Along (@AlongImna) July 11, 2022