ఆ టైంలో నా భర్త వేరే అమ్మాయిల పేర్లు పిలుస్తుంటాడు? నన్నేం చేయమంటారు?
Advice | మేడమ్! మీ సలహా మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నాకు పెండ్లయి ఏడేండ్లు అవుతున్నది. ఇప్పటి వరకూ పిల్లలు లేరు. మా ఆయన బిజినెస్ చేస్తున్నారు. దేనిలోనూ సక్సెస్ కాలేదు. పెండ్లయిన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయి. తాగొచ్చి కొట్టడం, బలవంతంగా అనుభవించడం, తనకు సంబంధం ఉన్న అమ్మాయిల పేర్లు ఉచ్చరించడం, వాళ్లతో నన్ను పోల్చడం.. గత ఏడేండ్లుగా నా కాపురం ఇలాగే కొనసాగుతోంది. అమ్మకు గుండె జబ్బు. అందుకే, ఈ విషయాలేవీ చెప్పలేను. నా జీవితం ఇలాగే కొనసాగాల్సిందేనా? విరక్తిగా ఉంది. నన్నేం చేయమంటారు? విడిపోయి ఒంటరిగా బతకగలనా? రోజు గడిస్తే.. మరుసటి రోజు ఏం అవుతుందోనన్న భయంతో బతకలేక పోతున్నా. నాకొక దారి చూపండి.
– ఓ సోదరి

నీలో నువ్వు చాలా ఘర్షణ పడుతున్నావు. ఘర్షణ పాజిటివ్ రూపం తీసుకొంటే.. నీ జీవితం బాగుపడుతుంది. భర్త అనే వ్యక్తి ఒక జీవన సహచరుడిగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా ఉండాలి. ఏ దంపతుల మధ్య అయినా సమాన సంబంధమే ప్రేమను, గౌరవాన్నీ నిలిపి ఉంచుతుంది. ఆధిపత్య సంబంధం ఆ బంధాన్ని బలహీన పరుస్తుంది. ఆ భావజాలంలోనే ఉన్న నీ భర్త.. నీ మీద హింసతో అధికారాన్ని చూపిస్తున్నాడు. దానికి నువ్వు లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్య సంబంధం హింస, బెదిరింపులతో కొనసాగనక్కర లేదు. నువ్వు మౌనంగా భరిస్తూ పోతే అతను మరింత రెచ్చిపోతాడు. అతని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వు. గృహ హింస కేసు పెట్టు. అతణ్ని భరించలేకపోతే తిరస్కరించి, విడిపోయే పూర్తి హక్కు నీకు ఉంది. అతనితో కలిసి ఉండటం వల్ల హింస, అవమానం, గాయాలు, అభద్రత తప్ప నీకేం మిగిలిందనీ? పైగా, ఒంటరిగా బతకలేనని భయపడుతున్నావు. ఒంటరిగానే ధైర్యంగా ఆత్మ విశ్వాసంతో బతకాలి. సహచరుడే యముడైనప్పుడు అతడి నుంచి విడిపోయి, నిన్ను నువ్వు రక్షించుకోవడమే మంచి నిర్ణయం. వెంటనే ఒక లేడీ లాయర్‌ను కలువు. నీ భర్త నిన్ను పెట్టే హింసలు నీ సన్నిహితులకు చెప్పు. నీ స్నేహితులు, మహిళా సంఘాల వారి సహాయం తీసుకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్, జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

