Bandi Sanjay | విద్యానగర్, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుం దో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఒకతప్పు చేయాలని అంటే, ఐఏఎస్‌లు మూడు త ప్పులు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించ డం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని నిరోధించాల్సింది పోయి తప్పు లు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించా రు. రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.
56 వేల నిరుద్యోగభృతి, మహిళకు సూటీ, తులం బంగారం, పీఆర్సీ, 4 డీఏలు, రైతుభరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందని వివరించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. ము స్లింలను బీసీల్లో కలిపి, క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేస్తున్నా బీసీ, ఎస్సీ సంఘాలు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.