తనదైన శైలి అభినయంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీశర్మ. తాజాగా ఆయన ‘కబ్జా’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. జే. చంద్రు దర్శకుడు. కన్నడ అరంగేట్రం గురించి మురళీశర్మ మాట్లాడుతూ ‘హిందీ, తెలుగు, మరాఠీ, తమిళం, మలయాళం భాషల్లో ఇప్పటివరకు రెండొందలకు పైగా చిత్రాల్లో నటించా. కన్నడంలో నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. కథలో కీలకమై పాత్రలో కనిపించబోతున్నా’ అన్నారు. ఈ సినిమాలో మురళీశర్మ..వీర్ బహద్దూర్ అనే పాత్రను పోషిస్తున్నారని, కథాగమనంలో ఆయన క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. సినిమా ఎనభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని నిర్మాత పేర్కొన్నారు.