తుర్కయంజాల్ : ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన భారత సైనికుడు ( Indian soldier) మురళీ నాయక్ ( Murali Naik ) త్యాగం దేశం మరువలేనిదని తుర్కయంజాల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోశికె అయిలయ్య అన్నారు.శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ వివేకానంద చౌరస్తాలో మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి ( Tribute) అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను ఒప్పించి సైన్యంలో చేరి దేశ భద్రతలో చివరి శ్వాస వరకు పోరాడి అమరుడయ్యాడని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.