Municipal Elections | మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
ఇక మున్సిపాలిటీ ఎన్నికలో తొలి ఫలితం కూడా వచ్చేసింది. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా.. 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మూడు వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు.
Laxettipet | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. మూడో వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసి లేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్, ఇతర అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటీజీ ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.