MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర పోరుకు వేళైంది. భారీ స్కోర్లు బాదేస్తూ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants).. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఢీకొడుతోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టిన ముంబై హ్యాట్రిక్‌పై కన్నేసిన గుజరాత్‌కు చెక్ పెట్టాలనుకుంటోంది. టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ బౌలింగ్ తీసుకుంది. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన విధ్వంసక ఓపెనర్ హేలీ మాథ్యూస్ ఈ మ్యాచ్‌లో ఆడుతోంది.
గుజరాత్‌కు ఓపెనర్ సోఫీ డెవినె, అనుష్క శర్మ, కెప్టెన్ అష్ గార్డ్నర్ భారీ స్కోర్లు అందిస్తున్నారు. బౌలింగ్‌లో రేణుకా సింగ్ , జార్జియా వరేహం రాణిస్తున్నారు. ముంబై విషయానికొస్తే నాట్‌సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నికోలా కారీ() బ్యాటింగ్ భారం మోస్తున్నారు. వీరితో పాటు బ్యాటుతో, బంతితో చెలరేగుతున్న ఈ ఆల్‌రౌండర్ గుజరాత్‌పై సత్తా చాటితే ముంబై మురవడం ఖాయం.
🚨 Toss 🚨@mipaltan won the toss and elected to bowl against @Giant_Cricket
Updates ▶️ https://t.co/Dxufu4Pisz #TATAWPL | #KhelEmotionKa | #MIvGG pic.twitter.com/9TBTv2IsLI
— Women’s Premier League (WPL) (@wplt20) January 13, 2026
గుజరాత్ జెయింట్స్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అష్ గార్డ్నర్(కెప్టెన్), జార్జియా వరేహం, భారతి ఫుల్మాలి, ఆయుషి సోని, కనికా ఆహుజా, కష్వీ గౌతమ్, తనూజ కన్వర్, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుకా సింగ్.
ముంబై ఇండియన్స్ తుది జట్టు : హేలీ మాథ్యూస్, జి.కమలిని(వికెట్ కీపర్), అమేలియా కేర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నొకోలా కారీ, సంజీవన సంజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, పూనమ్ ఖేమ్నర్, షబ్నం ఇస్మాయిల్, త్రివేణి వశిష్ట.