Student Visas : భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. భారతీయ విద్యార్థుల్ని హై రిస్క్ కేటగిరిలో ఉంచింది. దీంతో భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల మంజూరులో చాలా ఇబ్బందులుంటాయి. అంతేకాదు.. తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హై రిస్క్ కేటగిరి అంటే.. అసెస్ మెంట్ లెవల్ 3 లేదా ఏఎల్ 3 కేటగిరి.
ఈ కేటగిరిలో దక్షిణాసియా దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాను కూడా ఈ కేటగిరిలోనే చేర్చింది. గతంలో ఇండియా ఏఎల్2లో ఉండేది. ఏఎల్3 కేటగిరిలో ఉండటం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కఠినంగా ఉంటుంది. అదనపు తనిఖీలు నిర్వహిస్తారు. కొత్త రూల్స్ వల్ల విద్యార్థుల ఫైనాన్స్ స్టేటస్, ఇంగ్లీష్ స్పీకింగ్, తాత్కాలిక వసతి వంటి అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. ఇటీవల కేరళలో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ రాకెట్ బయటపడింది. విదేశాల్లో చదివే విద్యార్థులకు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు తేలింది. ఇలాంటి సర్టిఫికెట్ల నేపథ్యంలో ఇండియాపై ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఆస్ట్రేలియాలో చదివే విదేశీ విద్యార్థుల్లో ఇండియన్సే అధికం. అయినప్పటికీ, మన దేశాన్ని ఎల్3లో చేర్చింది. జనవరి 8 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అర్హులైన, ఉత్తమ విద్యార్థులకు మాత్రమే అవకాశాలు దొరుకుతాయని ఆస్ట్రేలియా అంటోంది.