ఆదిలాబాద్ : ఇచ్చోడ ( Ichchoda ) మండలం కేశవపట్నం అటవీ ప్రాంతంలో స్థానికంగా పోటీ వ్యవసాయం చేసుకుంటున్న ముల్తానీలు (Multanis ) అటవీ శాఖ, పోలీసులపై దాడికి ( Multanis attack ) పాల్పడ్డారు. దీంతో 11 మంది సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారులు పోలీసులకు కలిసి కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలోని 71 , 72 కంపార్ట్మెంట్లలో మొక్కలు నాటేందుకు వెళ్లారు.
కలప వ్యాపారం చేసే ఒక వర్గానికి చెందిన కేశవపట్నం ముల్తానీలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ముల్తానీలను నివారించే ప్రయత్నం చేయగా వారిపై కట్టెలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేశారు.
ఈ దాడిలో 11 మంది పోలీసులకు గాయాలు కాగా చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.