చిలిపిచెడ్, అక్టోబర్ 10 : బీసీల రిజర్వేషన్ లపై హై కొర్టు స్టే ఇవ్వడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు హనుమంతు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధం అని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీసీల అసమానతలను తీసివేస్తాం అని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ బీసీలపై సవతి ప్రేమ చుపించిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
42 శాతం రిజర్వేషన్ అసాధ్యం అని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం ఇది ముమ్మటికి బీసీ సామాజిక సమూహాన్ని దెబ్బతియడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల అభ్యున్నతి పాటుపడాలన్నారు. ఇది ఇలానే కాలయాపన చేస్తే బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.