పెద్దఅడిశర్లపల్లి, మార్చి 3 : దేవరకొండ నియోజకవర్గంలో ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్ అంటే ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా సేవలు అందించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ఇదిలా ఉండగా ఆయన తనయుడు ముచ్చర్ల శ్రీకాంత్‌యాదవ్ ‘నేను సైతం’ అంటూ ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. రెండేండ్లుగా కరోనా ఆపత్కాలంలో ఎంతో మందికి సాయం అందించి అండగా నిలిచారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలబడ్డారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రోత్సాహంతో దేవరకొండ, సాగర్ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు కబడీ క్రీడా పోటీల నిర్వహణతో యువతలో ప్రతిభను వెలికితీస్తున్నారు. గ్రామీణ క్రీడ కబడ్డీపై తనకున్న ఇష్టంతో పలు సందర్భాల్లో క్రీడా పోటీల నిర్వహణకు సాయం అందిస్తున్నారు. కబడ్డీ అసోసియేషన్ మండలాధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన నాటి నుంచి టోర్నమెంట్లు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో పోటీల నిర్వహణతో క్రీడాకారుల మెప్పు పొందారు.
చిన్న వయస్సులోనే తన స్వశక్తితో యాదాద్రి ఇన్ఫ్రా ప్రాజెక్టును ప్రారంభించి 2 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఎండీగా అతి తక్కువ ధరలో అన్ని అనుమతులతో కూడిన రియల్ వెంచర్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కంపెనీలను తలదన్నేలా అన్ని రకాల మౌలిక వసతులతో తీర్చిదిద్దారు. మార్కెటింగ్ రంగంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. శ్రీశైలం, సాగర్ హైవేలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో వెంచర్లు చేసి పేద, మధ్య తరగతికి అందుబాటులో ఉంచారు.
ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ సామాజిక సేవ, క్రీడల నిర్వహణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో యువతను ప్రోత్సహిస్తూ పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తున్నారు. ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ తనకున్న పరిచయాలతో ఉత్సాహంగా పనిచేశారు. అదే సమయంలో కడారి అంజయ్యతో కలిసి హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.