సిద్దిపేట/ కొండాపూర్, జనవరి 10: ‘కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ, అందులో ఉన్న నలుగురూ నాలుగు దిక్కుల ఉన్నారు.’ అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం తొగర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గౌరీరెడ్డి సంతోష, సంతోశ్‌రెడ్డితో పాటు మరో 100 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే జిల్లాకు గోదావరి జలాలు రానున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ, సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నదని, సంగారెడ్డి జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం తొగర్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గౌరీరెడ్డి సంతోషా-సంతోష్‌రెడ్డి, లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ మాణిక్యం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అశోక్, వార్డు సభ్యుడు భిక్షపతి, మాజీ వార్డు సభ్యులతో పాటు సురారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గొల్ల నర్సింలు, రోజాశ్రీనివాస్, ఇస్మాయిల్ బీ, ఎర్పుల బందయ్య, నిజాంపూర్కి చెందిన కాంగ్రెస్ నాయకుడు గూడల సత్యనారాయణ, కుమ్మరి నర్సింలు, టీజేఆర్ మండలాధ్యక్షుడు బేగం రమేశ్, యూత్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు కౌసర్‌తో పాటు 100వంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
వీరికి మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాలలు రావడం సీఎం కేసీఆర్ ఘనత అన్నారు. ఆయన నాయకత్వంలో సంగారెడ్డి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుస్తున్నాయని, తొందరల్లోనే సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంతో పాటు జిల్లాకు గోదావరి జలాలు రానున్నాయన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, నా వెంటపడి పనులు చేపిస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రజల మధ్యనే ప్రభాకర్
సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే హైదారాబాద్‌లో ఉంటే, గెలిచినా, ఓడినా చింతా ప్రభాకర్ సంగారెడ్డి ప్రజల మధ్యనే ఉంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు నీళ్లు, గ్రామాలకు ఉపాధి హామీ పనులు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10మంది ఎమ్మెల్యేలకు ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడన్నారు. ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మునిగిపోయే నావ అని, ఆ పార్టీలో ఉన్న నలుగురు నాయకులు నాలుగు దిక్కుల వాళ్లని, వాళ్లలో వారికే సఖ్యత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని జోస్యం చెప్పారు. సంగారెడ్డి పార్టీ కార్యకర్తలను కపాడుకుంటామని, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండాలి. మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు.
సంగారెడ్డిలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది గులాబీ జెండానే అని దీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు చింతా ప్రభాకర్ అన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీపీ మనోజ్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మావతిపాండురంగం, పార్టీ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు నర్సింహులు, రాములు, ప్రకాశం, మాజీ సర్పంచ్ రామాగౌడ్, ఎంపీటీసీలు రాందాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లాగౌడ్, నాయకులు మాధవరెడ్డి, విఠల్‌రెడ్డి, కరుణాకర్, సత్యనారాయణ, రమేశ్, సలావొద్దీన్, అశోక్, నజీర్ పటేల్, అంతయ్య, భిక్షపతి, నాగయ్య, మాణిక్య ప్రభు, ప్రభుదాస్, ప్రేమనందం, మోహన్‌గౌడ్, ప్రభాకర్, రఘునాథ్‌రెడ్డి, రవి, అరవింద్‌రెడ్డి, రాములు, ఆంజనేయులుగౌడ్, జలేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్.కుమార్ ఉపసర్పంచ్ రామప్ప తదితరులు పాల్గొన్నారు.