కారేపల్లి,మే 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్)లో గల బీఆర్ఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు సిద్ధం శెట్టి చిన్న నాగయ్య తల్లి సిద్ధం శెట్టి వెంకట నరసమ్మ(54) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఫోన్ చేసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మంగళవారం కారేపల్లి క్రాస్ రోడ్ లో వెంకట నరసమ్మ అంతక్రియలు జరగగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు హాజరై మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.