ఈత రాకపోయినా నీటిలో దూకి.. కూతుర్ని కాపాడి కన్నుమూసిన తల్లి
కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కూతుర్ని కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలకు తెగించింది. ఈత నేర్చుకుంటున్న కూతురు మునిగిపోతుందని.. తనకు స్విమ్మింగ్ రాకపోయినా సరే కాపాడేందుకు నీటిలోకి దూకేసింది. అదే నీటిలో మునిగి మరణించింది. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామానికి చెందిన అనూష(35)కు ఇద్దరు పిల్లలు ధనలక్ష్మీ(12), అక్షిత (10). భర్త ఐదేళ్ల కిందటే చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను అనూష పోషిస్తోంది. వేసవి సెలవులు కావడంతో వారిద్దరికీ నీటి గుంతలో ఈత నేర్పించేందుకు తీసుకెళ్లింది. చిన్న కూతురు అక్షిత నడుము కూల్ డ్రింక్ బాటిళ్లు కట్టి గుంతలోకి దింపింది. అయితే నీటిలోకి దిగిన తర్వాత అక్షిత ఏడవడంతో అనూష కంగారుపడిపోయింది. తన కూతురు నీటిలో మునిగిపోతుందేమో అన్న భయంతో గుంతలోకి దూకింది.
కానీ అనూషకు కూడా ఈత రాకపోవడంతో అదే నీటి గుంతలో మునిగిపోయింది. దీంతో పెద్ద కూతురు ధనలక్ష్మీ పరిగెత్తుకుంటూ వెళ్లి స్థానికంగా ఉన్న రైతులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలియగానే హడావుడిగా వచ్చిన వారు.. కూల్‌డ్రింక్ బాటిళ్లతో ఉన్న అక్షితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఈత రాకపోవడంతో అనూష నీట మునిగి మరణించింది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

