Kazipet | వడ్డేపల్లి చెరువులో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నం..కాపాడిన వాకర్స్
వడ్డేపల్లి చెరువులో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన వాకర్స్ వారిని కాపాడారు.
కాజీపేట: వడ్డేపల్లి చెరువులో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన వాకర్స్ వారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని జూబ్లీ మార్కెట్‌కు చెందిన రాజ్యలక్ష్మి (30) కుటుంబంతో నివాసముంటుంది. ఇంట్లో గొడవలు జరగడంతో మానసికంగా కృంగి పోయిన రాజ్యలక్ష్మి చనిపోవాలని నిర్ణయం తీసుకొని సోమవారం తన చిన్న కూతురును తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
ఉదయం వడ్డేపల్లి చెరువులోకి దిగుతుండగా అక్కడే వాకింగ్ చేస్తున్న కురుమని మహేందర్ రెడ్డి చూసి తోటి వాకర్స్ పాడి ప్రకాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, రంగారావు, తదితరుల సహకారంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతతరం వారిని కాజీపేట పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

