సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 25: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ను సందర్శించింది. డ్రగ్ కంట్రోల్, అడ్మిన్ డీజీ అండ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, డైరెక్టర్ జనరల్ డీసీఏ నేతృత్వంలో సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, డీఎంఈ విమలాథామస్, అసిస్టెంట్ డీఎంఈ డాక్టర్ వాణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధామాధురి, ఎంసీఎంసీ సభ్యులు మెడికల్ కళాశాల బోధన దవాఖానను సందర్శించారు.
ఈ సందర్భంగా దవాఖానలోని వార్డులు, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ, విద్యార్థుల తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్గదులను పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు దవాఖానలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఇప్పటికీ కావాల్సిన సౌకర్యాల కల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్, దవాఖాన సూపరింటెండెంట్లను ఆదేశించారు. నిర్మాణం లో ఉన్న భవనాల పనులను వేగంగా పూర్తి చేయాల న్నారు.
ఆయా పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిసామని పేర్కొన్నారు. దవాఖానలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థుల రవాణా కోసం బస్సు ఏర్పాటుతో పాటు దవాఖాన, మెడికల్ కళాశాలలో భద్రత చర్యలు చేపట్టడా నికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, దవాఖాన సూపరిం టెం డెంట్ డాక్టర్ అనిల్‌కుమార్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, సంబం ధిత అధికారులు పాల్గొన్నారు.