IND vs WI | టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మరోసారి తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో (West Indies vs India) జరుగుతున్న తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరిని స్టన్ చేశాడు. తొలి టెస్టులో భాగంగా 28వ ఓవర్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వేసిన ఆఫ్ స్టంప్ (Off Stump) బాల్‌ను జెర్మైన్ బ్లాక్‌వుడ్ (Jermaine Blackwood) మిడాఫ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే అప్పటికి మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ గాల్లోకి అమాంతం ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో బ్లాక్‌వుడ్ (14) పెవిలియన్ చేరగా.. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వెస్టిండీస్(West Indies vs India)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న టీమ్ఇండియా వికెట్ల వేట ప్రారంభించింది. పేస్ బౌలింగ్‌కు అంతగా సహకరించని చోట స్పిన్నర్లు తమదైన ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (5/60), జడేజా (3/26)ల ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 150 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr
— FanCode (@FanCode) July 12, 2023