న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మా వడ్లు కొనాలి’అని తెలంగాణ రైతులు పది రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదు. సమస్యలపై రైతులతో మాట్లాడాలన్న సోయి లేదు. అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్న మాటలు యాది లేవు. మద్దతు ధరల చట్టం తెస్తామని ఇచ్చిన హామీ పత్తా లేదు. ఎర్రటెండలో వడ్డు కొనండని అన్నదాతలు మొత్తుకుంటున్నా.. ‘కొనం పోండి’ అంటూ కర్కశంగా మాట్లాడిన బీజేపీ నేతలు ఇప్పుడు బడాయి మాటలు మాట్లాడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఈ బడాయి నేతలు ఏమన్నారంటే?
రైతుల పట్ల దేశం గర్వంగా ఉంది. రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే దేశం మరింత సుభిక్షంగా మారుతుంది.
– మోదీ
ప్రపంచ దేశాలకు అవసరమైన సేంద్రియ ఆహారాన్ని రైతన్నలు పండిస్తే, దేశ ఆర్థిక పరిస్థితిలో పెను మార్పులు చోటుచేసుకొంటాయి.
-అమిత్ షా