బాసర : విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకుగాను బాసర ( Basara ) గోదావరి నది( Godavari River ) లో నిర్మల్ జిల్లా పోలీసులు మాక్ డ్రిల్ ( Mock Drill ) నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ( SP Janaki Sharmila ) పర్యవేక్షణలో టీమ్ శివంగి, స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు గోదావరి నదిలో స్పెషల్ బోట్ల సహాయంతో శిక్షణ ఇచ్చారు. ప్రకృతి విపత్తులు ఎదురైన సమయంలో వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.
లోతైన నీటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ద్వారా రెస్క్యూ టీం పనివిధానాన్ని వివరించారు. విపత్తు లు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎప్ ( NDRF ) తరహాలో డీడీఆర్ఎఫ్ ( DDRF ) ఏర్పాటైందని, భద్రతా పరంగా ఎలాంటి సమస్య లు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. బాసర గోదావరి తీర ప్రాంతంలో మరోసారి ప్రాణ నష్టం జరుగకుండా ఆలయ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.