మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఒక హిందూ యువతిపై ఇద్దరు ఆకతాయిలు దాడి చేశారు. ఆమె ఒక హిందువు అయి ఉండి ముస్లిం యువతిలాగా బుర్కా ధరించి వెళుతున్నందుకు ఆ ఇద్దరు పసిగట్టి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దానిని చూసి ఆకతాయిలను అరెస్టు చేశారు. బాధితురాలిని విచారణ చేయగా.. ఆమె తన స్నేహితులతో రోడ్డుపై వెళుతుండగా.. ఆ ఇద్దరు యువకులు వచ్చి తన బుర్కాని తీసి చూశారని, వారికి తను హిందువు అని తెలియడంతో తనను కొట్టారని చెప్పింది. కానీ ఈ విషయమై ఫిర్యాదు చేస్తే తన తల్లిదండ్రులకు తెలిసిపోతుందనే భయంతో పోలీసుల వద్దకు రాలేదని చెప్పింది.
ఫిర్యాదు అందకపోయినా ఆకతాయిలు మరోసారి తప్పు చేయకూడదనే ఉద్దేశ్యంతో వారిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.