స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 7: కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని చూసి కడియం శ్రీహరిని గెలిపిస్తే, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లో చేరి నియోజకవర్గ ప్రజల ఓటును, ఆత్మాభిమానాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శనివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మున్సిపల్ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఓటర్లు చూపి స్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ అవమాన పరుస్తున్నాడని అన్నారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఈ నెల 11న జరుగనున్న ము న్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అధికారపార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారి ఆగడాలకు హద్దు ఉండదని, బీఆర్ఎస్ వారిని గెలిపిస్తే సమస్యలపై కడియంను నిలదీయవచ్చని ఆయన పేర్కొన్నా రు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్దే అని, ప్రత్యేక జీవో తెచ్చి మూడేళ్ల వరకు ఇంటి పన్నులు పెంచకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు తాను సొంత ఖర్చులతో కుట్టుశిక్షణ ఇప్పించి, మిషన్లను ఉచితంగా అందించి నెలకు సుమారు రూ.20వేలకు పైగా సంపాదించేలా ఉపా ధి కల్పిస్తానని పేర్కొన్నారు. కాగా, రాత్రి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
అబద్ధాల కడియం మాటలు నమ్మొద్దు : మాజీ ఎమ్మెల్యే రాజయ్య.
గెలిపించిన నియోజకవర్గ ప్రజలను కాదని, తన బిడ్డ కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడి యం శ్రీహరి మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెబు తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా, కోర్టు కచ్చి తంగా అనర్హత వేటు వేస్తుంది. మరో ఆరు నెల ల్లో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావ డం ఖాయం. కడియం వల్ల అయ్యేది ఏమీ లేదు. ఆయనకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరి కోసం బీఆర్ఎస్ ఉంది.