వీణవంక: రాష్ట్రంలోని ముస్లీం మైనార్టీల అభివృద్ది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని, సీఎం కేసీఆర్ కోట్లది రూపాయలతో మైనార్టీల కోసం సంక్షేమ పథకాలు తీసుకోచ్చారని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. మండల పరిధిలోని నర్సింగపూర్, మామిడాలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు. ముస్లీం మైనార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం తీసుకోచ్చిన మైనార్టీ సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. మైనార్టీ గురుకులాలు, విద్యారంగలో స్కాలర్షిప్లు, షాదీముబారక్‌తో పాటు మసీదుల మర్మమతుల కోసం నిధులు అందిస్తున్నారని అన్నారు.
సామాజికంగా, రాజకీయంగా మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ మైనార్టీలందరూ మద్దతుగా ఉండాలని ఆయన కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు