నస్రుల్లాబాద్ : నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad Mandal ) మైలారం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత (Kavitha) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ( BRS ) నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో టపాకాయలు కాల్చి , కేక్ కట్ చేశారు.
నస్రుల్లాబాద్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులను ( Pens ) పంపిణీ చేశారు. మైలారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లను( Plates) , పండ్లను ( Fruits ) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు గణేష్ ,నర్సింలు గౌడ్, సాయి, సాయిలు, మోసిన్, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు .