హైదరాబాద్ : రాష్ర్ట ప్రజలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. శివలింగానికి దండం పెట్టిన ఫోటోను కవిత షేర్ చేశారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న శివాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ఆలయాల్లో శివనామస్మరణ మార్మోగిపోతోంది. భక్తులు ప్రత్యేక పూజలు చేసి, శివలింగాలకు అభిషేకం చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు #మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు #Mahashivratri2021 pic.twitter.com/HFISBkf4Vg
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 11, 2021