మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును ఆలయ కమిటీకి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ద్వారా శుక్రవారం పంపించారు. దుర్గ్గామాతపై భక్తితో తనవంతుగా ఈ విరాళాన్ని అందజేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.