ఆదిలాబాద్ : దశాబ్ద కాలంగా ఎదురకొంటున్న రోడ్డు సమస్యను తీర్చకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections ) ఓటు వేయమని భీంపూర్ మండల గ్రాడ్యుయేట్ జేఏసీ (JAC leaders ) హెచ్చరించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కమిటీ సభ్యులు నరేష్ రెడ్డి (Naresh Reddy) మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న తమ ప్రాంత రోడ్డు సమస్య ను ఎదుర్కొంటూనే ఉందన్నారు.
పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో పార్టీల నాయకులు హామీలు ఇస్తూ ఓట్లు దండు కుంటున్నారన్నారు. రోడ్డు సమస్య ( Road Problem ) తీర్చడం ప్రభుత్వంతో కాకుంటే మండలాన్ని పక్కనున్న మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో దశలవారీగా రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.
గ్రామాల్లో ఏ నాయకున్ని, అధికారులను తిరగనివ్వబోమని , తామే స్వయం పాలన చేసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో బొంత నితిన్, శైలందర్ యాదవ్, నితిన్ యాదవ్, లతీఫ్, శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.