షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 14: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఆదివారం పట్టణానికి చెందిన అంజన్గౌడ్ సహకారంతో క్రీడాకారులకు క్రీడాసామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు.
అదే విధంగా షాద్నగర్ మినీ స్టేడియాన్ని కోట్ల రూపాయాలను వెచ్చించి అత్యాధినిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. క్రీడాసామగ్రికి పంపిణీకి సహకరించిన దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య, బస్వం, తిరుపతిరెడ్డి, ముక్తార్అలీ, నరేశ్, ఖదీర్, మాధవులు, మురళీమోహన్, గోపాల్, రవితేజ, కబీర్, మున్నా పాల్గొన్నారు.