MLA Talasani | చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి : ఎమ్మెల్యే తలసాని
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాముఖ్యత నివ్వాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అమీర్‌పేట, జూలై 9 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాముఖ్యత నివ్వాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం అమీర్పేలోని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ స్మారకార్థం బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీ వరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి విద్యార్థులను ఉత్తేజ పరిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు క్రీడల పట్ల కూడా కొంత సమయం కేటాయించడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఏ క్రీడలపట్ల ఆసక్తి ఉందో గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తమ ప్రతిభను చాటేందుకు ఇలాంటి క్రీడాపోటీలను వేదికలుగా మార్చుకోవాలని చెప్పారు. గడిచిన 9 సంవత్సరాల నుండి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న సచిన్, అతని బృందాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి ఇంటర్ కాలేజ్ లెవెల్ లో జరిగే ఈ పోటీలలో సుమారు 100 టీమ్ లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, శ్రీనివాస్ గౌడ్, బాబా గౌడ్, ప్రకాష్ గౌడ్, సచిన్, రాహుల్, పరమేష్, అబ్రహం, రాకేష్, అర్జున్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

