e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Sunke ravishanker | ద‌ళితుల త‌ల‌రాత‌లు మార్చేందుకే ద‌ళిత‌బంధు: ఎమ్మెల్యే ర‌విశంక‌ర్‌

Sunke ravishanker | ద‌ళితుల త‌ల‌రాత‌లు మార్చేందుకే ద‌ళిత‌బంధు: ఎమ్మెల్యే ర‌విశంక‌ర్‌

ఇల్లంద‌కుంట‌: ద‌ళితుల త‌ల‌రాత‌లు మార్చేందుకే ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుచేస్తున్న‌ట్లు చొప్ప‌దండి ఎమ్మెల్యే సుంకె ర‌విశంక‌ర్ పేర్కొన్నారు. అతి త్వ‌ర‌లోనే ద‌ళితులంద‌రూ ధ‌న‌వంతులుగా మారుతార‌ని చెప్పారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇల్లంద‌కుంట మండ‌లం గ‌డ్డివానిప‌ల్లి గ్రామంలో సుంకె ర‌విశంక‌ర్ శుక్ర‌వారం ద‌ళితుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో సంక్షేమ సార‌థి కేసీఆర్‌కు అండ‌గా నిలుద్దామ‌ని పిలుపునిచ్చారు. గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2001నుంచి ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ప‌ట్టంగ‌డుతున్నార‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లోనూ అదే పున‌రావృతం అవుతుంద‌ని సుంకె ర‌విశంక‌ర్ ధీమా వ్య‌క్తంచేశారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ క‌ష్ట‌ప‌డేత‌త్వంగ‌ల వ్య‌క్తి అని, ఆయ‌న‌కు నిరుపేద‌ల బాధ‌లు తెలుసున‌ని సుంకె ర‌విశంక‌ర్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ ఉద్య‌మ నేప‌థ్యాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టికెట్ ఇచ్చారని వెల్ల‌డించారు. బీజేపీ అంటే బ‌డా జూటా పార్టీ అని ర‌విశంక‌ర్ పేర్కొన్నారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తమ‌కు వ‌ద్ద‌ని సాక్షాత్తూ అన్న‌దాత‌లే ఆందోళ‌న చేస్తున్నా బీజేపీ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అన్న‌దాత‌ల‌కు రైతుబంధు, రైతు బీమా, వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేన‌ని తెలిపారు. అందుకే రైతన్న‌లంతా కేసీఆర్ వెంటే ఉంటార‌న్నారు. ద‌ళిత‌వాడ‌ల్లో కొత్త‌కాంతులు నింపుతున్న సీఎం కేసీఆర్‌కు ద‌ళితులంతా అండ‌గా ఉండాల‌ని సుంకె ర‌విశంక‌ర్ కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయ‌కుడు గ‌ణ‌ప‌తి, సీనియ‌ర్ నాయ‌కుడు మహేంద‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement