జగిత్యాల : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 21 మంది నిరుపేదలకు జగిత్యాల పావని కంటి దవాఖానలో ఎమ్మెల్యే ఆపరేషన్స్ చేశారు.ఈ సందర్భంగా ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్స చేసిన ఎమ్మెల్యేకి పేషంట్స్ వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో KDCC రాంచందర్ రావు, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, కౌన్సిలర్లు క్యాడాసు నవీన్, కోరే గంగామల్లు, సర్పంచులు జాన్, తిరుపతి, జీవన్ రెడ్డి, ఎంపిటిసిలు లావణ్య,రెడ్డి రత్న రవి,నాయకులు మోయిజ్, షోయబ్, డా.విజయ్, తదితరులు పాల్గొన్నారు.