అల్వాల్ ఏప్రిల్ 8 : పని చేస్తేనే పూట గడిచే కార్మికులకు లేబర్ కార్డుతో ఆర్థిక భరోసా లభిస్తుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మచ్చబొల్లారం డివిజన్ మార్కెట్ లో సురేష్ సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం, అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీద అందజేశారు. కానాజీగూడాలో సీసీరోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని 26 సంవత్సరాల నుండి బొల్లారం మార్కెట్ కు వచ్చే ప్రజలకు దాహం తీర్చేందుకు ఎంతో బాసటగా నిలుస్తుందన్నారు.
నార్ల సురేష్ ఎన్నో సామాజిక సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, ప్రశాంత్ రెడ్డి, మహేశ్, చరణ్గిరి, అతిక్‌పాషా, నర్సింగ్ రావు,శంకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటేష్, సరిత తదితరులు పాల్గొన్నారు.