– పి. వంశీ, మోత్కుర్
స్థలాన్ని కంపాస్ నిర్ణయిస్తుంది. మధ్యాహ్నం ఎండలో కూడా ‘దిక్సాధన’ చేసి కచ్చితమైన దిశను తెలుసుకోవచ్చు. సూర్యుని నడకను బట్టి దిశను నిర్ధారణ చేయకూడదు. ఇంటి స్థలం తూర్పునకు బాగా ఉంచి.. అంటే ఉత్తరం దిశ ‘సున్నాను’ చూపిస్తూ తూర్పు 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ స్థలం తూర్పునకు సరిగ్గా ఉన్నట్లు అవుతుంది. ‘భౌమా అయస్కాంతం’ సరైనది అయితే సరిగ్గా ఉత్తరాన్ని నిర్ధారిస్తుంది. అలాకాక ఉత్తరం దిశ అంటే ‘నార్త్ బాణంగుర్తు’ 360 డిగ్రీలు చూపిస్తూ అటు కుడి దిక్కు కానీ ఎడమ దిక్కు కానీ తిరిగిపోయినప్పుడు.. ఆ స్థలం సరిగ్గాలేదు అనేది స్పష్టం అవుతుంది. అలా ‘నార్త్ పాయింట్’ 45 డిగ్రీలు వాయవ్యం మూల తిరిగినట్లు అయితే ఆ తూర్పు స్థలం ఆగ్నేయ స్థలం అవుతుంది.
ఇలా కంపాస్‌ను బట్టి దిశలు మారిపోతుంటాయి (తెలుస్తాయి). అంటే అక్కడ ఉన్న ఉత్తర-దక్షిణ అయస్కాంత నాడీ మారిపోయి కనిపించినప్పుడు మనం అనుకునే దిక్కులు.. అంటే దక్షిణం దిక్కు నైరుతిగా ఉంటుంది. పడమర దిక్కు – వాయవ్యంగా ఉంటుంది. ఇలా చిన్నగా ఉండే మూలదిక్కులు పెద్దవిగా వైశాల్యాన్ని కలిగి ఉండే దిశలు చిన్నవిగా (విదిక్కులుగా) మారతాయి. ఇదంతా చాలా జాగ్రత్తగా స్థలాన్ని పరిశీలించి తేల్చాల్సిన విషయం. గాలికి చూసి దిక్కులను నిర్ధారించవద్దు. అలా ఎవరి ఇష్టంగా వారు ఒకే వీధిలో ఒకచోట తూర్పు అని, దక్షిణం అని ఇండ్లు కడుతుంటారు. ఇదంతా అయోమయాన్ని కలిగిస్తుంది. ఇంటి భవితవ్యాన్ని ఇంటి దిశ నిర్దేశిస్తుంది. అందుకే ‘దిశను బట్టి దశ’ అంటారు. మీకు తెలుసున్న వారితో చూపించి నిర్ణయం తీసుకోండి. విదిక్కులు వ్యాపారానికి ఉపకరిస్తాయి.
– ఆర్.బి. సురేష్, షామీర్పేట
ఇంటికున్న బాల్కనీలు కలుపుకోవడం గురించి మీరు అడుగుతున్నారు. ఇల్లును ఇల్లుగా, గొప్పగా కట్టుకోవాలి. అంటే, కింద ఎలా కడతామో ఇంటి చుట్టూ ఖాళీ వదిలి పైనకూడా కేవలం పిల్లర్లు కలుపుకొని చుట్టూ ఉన్న ఖాళీ స్థలం వాడకుండానే కట్టుకోవాలి. మీ అవసరం మేడమీద స్థలం పెంచుకోవడానికి బాల్కనీలు కలుపుకోవాలని అనుకుంటున్నారు. దక్షిణం-పడమర వైపు ఉన్న బాల్కనీలలో ఏదో ఒకదాన్ని మాత్రమే కలుపుకోవాలి.

అటు దక్షిణ-నైరుతి, ఇటు పశ్చిమ-నైరుతి ఇంటిలో కలిపినప్పుడు ఆ మూల పిల్లర్ లోపలికి వస్తుంది. అలా మూలలు, పిల్లర్లు ఇంటిలోకి రాకూడదు. కాబట్టి ఒకవైపు మాత్రమే కలుపుకోవాలి. మీరు రెండువైపులా కలుపుకొని గది (నైరుతి పడక గది)ని పెంచుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం మానుకోండి. ఇక తూర్పు-ఉత్తరాలను ఎట్టి రీతిలోనూ ఇంటిలోకి కలపొద్దు. కొందరు కిచెన్ పెంచి ఆగ్నేయం-వాయవ్యం పెంచి టాయిలెట్ కలుపుకొంటారు. అలా కూడా చేయకండి.
– వి. దామోదర్, రాజ్‌పేట
ఇంటికి గేటు ఏ దిశలో.. అంటే తూర్పు వైపుపెట్టినా, ఉత్తరం దిక్కు పెట్టినా.. ఉత్తరంవైపు ఉన్న ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు-ఈశాన్యంలో ఒక గేటు పెట్టుకోవచ్చు. ఇంటికి తూర్పు-ఈశాన్యంలో సింహద్వారం పెట్టినప్పుడు ఆ తూర్పు ద్వారానికి ఎదురుగా ఒకగేటు పెట్టండి. ఇంటి ఈశాన్యం కోసం (మూల) గేటులో పడకుండా ఇంటి ద్వారానికి ఎదురుగా గేటు పెద్దదిగా కూడా పెట్టుకోవచ్చు.

స్థలానికి ఈశాన్యంలో గేటు ఉండటం అనేది ఆ స్థలం వెడల్పును బట్టి ఉంటుంది. ఇల్లుకు ఉన్న ద్వారానికి పెట్టినప్పుడు ఆ గేటు స్థలం మధ్యలోకి వస్తుందా? ఆ ఆగ్నేయం భాగంలోనికి పోతుందా? అనేది చూసి పెట్టుకోండి. కారణం ఇంటి స్థలం మధ్యభాగం వేరు.. ఆగ్నేయ భాగం వేరు. అన్ని విధాలుగా తెలుసుకొని గేట్లు ఏర్పాటు చేసుకోండి. ఉచ్ఛమైన గేట్లు ఉన్నత ఫలితాలు ఇస్తాయి. నడకను బట్టి నాణ్యత వస్తుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143