e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News అర్హులందరికీ ‘కల్యాణలక్ష్మి’

అర్హులందరికీ ‘కల్యాణలక్ష్మి’

  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పథకం
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • 187 మంది లబ్ధిదారులకు రూ. 1.87 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ

నర్సంపేట,నవంబర్‌29: అర్హులందరికీ కల్యా ణలక్ష్మి చెక్కులను అందిస్తున్నామని, ఈ పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్‌లోని 187 మంది కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ లబ్ధిదారులకు రూ. 1.87 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ పైసా లంచం ఇవ్వకుండా, పైరవీలు లేకుండా ఒక్కో నిరుపేద లబ్ధిదారుకు రూ. 1, 00,116లు అందిస్తున్నామని అన్నారు. నిరుపేదలైన ప్రతి ఒక్క అడపడుచుకు మేనమామ కట్నం కింద ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకం దేశంలో ఒక్క తెలంగాణలోనే అందిస్తున్నట్లు, ఇత ర రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు చ ర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో రారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ పవన్‌కు మార్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్నె వెంకన్న, కుండె మల్లయ్య, రఫీ, బుర్రి తిరుపతి, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

మిర్చి రైతులు అధైర్య పడొద్దు

నర్సంపేట రూరల్‌: మిర్చికి కొత్త రకం తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని, రైతులు ఏ మాత్రం అధైర్య పడొద్దని, సమస్యకు శాశ్వత పరి ష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఈ సమస్యను శాస్త్రవేత్తలకు వివరిం చగా, 15 రోజల క్రితం చంద్రయ్యపల్లి, భాంజీపే ట, దాసరిపల్లి, కమ్మపల్లి గ్రామాల్లోని పురుగు సోకిన మిర్చి తోటలను పరిశీలించి, నమూనాను ఢిల్లీలోని ల్యాబ్‌కు తరలించి తామర పురుగులు తెగుళ్లుగా గుర్తించారన్నారు. నేడు రెండో విడుత శాస్త్రవేత్తలు నర్సంపేట డివిజన్‌కు రానున్నారని తెలిపారు. మళ్లీ మిర్చి పంటలపై పరిశోధనలు జరి పి పురుగు నివారణకు రైతులకు సూచనలు, సల హాలు ఇవ్వనున్నారని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement