కరీమాబాద్, నవంబర్ 17: నియోజకవర్గ ప్రజలంతా ఒక్కతాటిపై ఉండి.. తూర్పును అన్ని విధాలా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా మరోసారి బీఆర్ఎస్ను గెలిపిద్దామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఉర్సులో శుక్రవారం 40వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లోని నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని కార్యకర్తలను కోరారు. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేలా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేశ్‌బాబు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోలా నటరాజ్, కార్పొరేటర్ రవి, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, మరుపల్ల భాగ్యలక్ష్మి, నాయకులు యేర కోటేశ్వర్, వొగిలిశెట్టి అనిల్‌కుమార్, ఆరెల్లి రవి, వనం కుమార్, కోరె కృష్ణ, ఎలగొండ రవి, వంగరి సురేశ్ పాల్గొన్నారు. అలాగే, 40వ డివిజన్లో నన్నపునేని శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్ల రవి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్, నాయకులు అనిల్‌కుమార్, యేర కోటేశ్వర్, ఆరెల్లి రవి, వనం కుమార్ పాల్గొన్నారు.
శ్రీతారకరామ పరపతి సంఘం బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు లక్ష్మీనగర్‌లోని సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, ఇన్చార్జి నాగపురి సంజయ్‌బాబు, నాయకులు మధుసూదన్, శివమూర్తి, వాసు, రవీందర్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: ‘వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎగరాలి గులాబీ జెండా.. గెలవాలి నరేందర్’ అనే పాటను బీఆర్ఎస్ వరంగల్ 39వ డివిజన్ అధ్యక్షుడు బొరిగం నర్సింగం రూపొందించాడు. ఈ పాట సీడీని శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ 21వ డివిజన్ అధ్యక్షుడు బింగి మహేశ్‌తోపాటు శ్రీను, ఓంప్రకాశ్, గురునాథ్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి నన్నపునేని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్ ఫుర్ఖాన్, డివిజన్ అధ్యక్షుడు అనిల్, నాయకుడు డీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: బీజేపీ నాయకుడు, రాష్ట్ర కుమ్మరుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీసీ ఐక్య చేతన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకారపు మోహన్ బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీ విధానాలు నచ్చక, నాయకత్వంపై నమ్మకం లేక బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మట్టెవాడలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో చేరగా, ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు బస్వరాజు శిరీషా శ్రీమాన్, ఆకుతోట తేజస్వీ శిరీష్, నాయకులు తోట హరీశ్, నంబి మురళి, అజీం పాల్గొన్నారు.