ఐనవోలు : మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి శివాలమర్రి చెట్టును వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. ఐనవోలులో గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి ఆదివారం సాయంత్రం శివాలమర్రి చెట్టు నెలకొరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. శివాలమర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘శివాలమర్రి చెట్టు పునరుజ్జీవం కోసం హార్టికల్చర్, ఫారెస్ట్ అధికారులతో మాట్టాడాను. శివాలమర్రి చెట్టు పునరుజ్జీవం పోసుకునేందు కావాల్సిన ఏర్పాట్లును చేయిస్తాం. చెట్టు పునరుజ్జీవం కోసం ఎన్టీవో ముందుకు వస్తున్నారు. భూమి యజమానులతో మాట్లాడి వారి సహకారంతో భక్తులు, గ్రామస్తుల కోరిన మేరకు చెట్టును తిరిగి నిలబెట్టె విధంగా చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
ఆయన వెంట ఆలయ కమిటి చైర్మన్ ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, మాజీ సర్పంచ్ కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ మధుచంద్రగౌడ్, ఆలయ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, నాయకులు సుధీర్, వెంకటేశ్వర్ రావు, భాస్కర్, రాజు, శ్రీనివాస్, చందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, భానుప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.