పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం అందజేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రకటించారు. కిలో బంగారానికి సంబంధించిన పైసలు త్వరలోనే యాదాద్రి ఆలయం అధికారులకు అందజేస్తామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వాములు కావడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.