MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
MLA Kalvakuntla Sanjay } ఏం మాట్లాడటానికి చేతకాక ఒక జుట్టు గురించి మాట్లాడటం, బొచ్చు గురించి విమర్శలు చేయడం.. కేంద్రంలోని ఎంపీలు మాట్లాడే చిల్లర భాష అదేనా..? అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు.
MLA Kalvakuntla Sanjay | పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను రెండు జాతీయ పార్టీలు నాశనం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన భవిష్యత్ తరాలకు మోసం జరుగుతుంది. ఏం తమాషాలు చేస్తున్నరు వీళ్లు..ఒక్క బీజేపీ నాయకుడన్నా వచ్చి రైతులకు నీళ్ల గురించి మాట్లాడిండా అని ప్రశ్నించారు.
రైతులకు కరెంట్ గురించి అడిగారా..? తెలంగాణకు గ్రాంట్ కావాలని అడిగారా..? ఒక్కరోజైనా తెలంగాణకు ఇండస్ట్రీ తీసుకురావాలని బీజేపీ ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా అడిగారా..? అని ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. బయట కామెడీ చేస్తున్నడు. ఒకడేమో భిక్షాటన అంటరు.. ఒకడేమో ఆ డ్రామా, ఈ డ్రామా అంటడు. మా తెలంగాణ రైతులకు ఏం తీసుకొస్తున్నరో చెప్పండి.. మా తెలంగాణ ఇండస్ట్రీకి ఏం తీసుకొస్తున్నడో చెప్పండి..మా తెలంగాణ కరెంట్ గోసలు పడుతున్నది.. ఢిల్లీ నుంచి ఏం తీసుకొస్తున్నరో చెప్పండి. పన్నేండేళ్ల నుంచి కేంద్రప్రభుత్వంలో ఉంది మీరే కదా.. పెద్దన్న అని చెప్తరు.. ఏం చేస్తున్నడు.. ఇక్కడ చిన్నన్న మోసం చేస్తున్నడని మండిపడ్డారు.
అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న ఇద్దరు కలిసి తెలంగాణను నిలువునా ముంచుతున్నారు. గాలి మాటలు మాట్లాడటం వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇద్దరు అదే పనిలో ఉన్నరు..ఎందుకంటే పని చేతకాదు..ఇండస్ట్రీ గురించి, నీళ్లు గురించి మాట్లాడటం రాదు.. కరెంట్ గురించి మాట్లాడటానికి రాదు.. ఏం మాట్లాడటానికి చేతకాక ఒక జుట్టు గురించి మాట్లాడటం, బొచ్చు గురించి విమర్శలు చేయడం.. కేంద్రంలోని ఎంపీలు మాట్లాడే చిల్లర భాష అదేనా..? అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు.
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను రెండు జాతీయ పార్టీలు నాశనం చేస్తున్నాయి
అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న కలిసి తెలంగాణను ముంచుతున్నారు
రైతుల గురించి మాట్లాడమంటే ఒకడు బిక్షాటన అని డ్రామాలు చేస్తాడు
జుట్టు గురించి మాట్లాడడానికేనా మిమ్మల్ని ఎంపీగా గెలిపించింది?
ఒక కేంద్ర మంత్రి, ఎంపీ మాట్లాడాల్సిన మాటలేనా అవి
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Also :
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

