తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మాచర్ల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంగాభవాని జలశుద్ధి కేంద్రాన్ని ( Water plant)ను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ( Kavampalli Satyanarayana ) ప్రారంభించారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను నిర్వాహకుడు మాచర్ల సాయికిరణ్ గౌడ్‌ను అభినందించారు. గ్రామస్థులకు క్వాలిటీ వాటర్ అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బండారి రమేష్, మోరపల్లి రమణారెడ్డి, గుజ్జుల రవీందర్ రెడ్డి, మీసాల అంజయ్య, దావు సంపత్ రెడ్డి, కొమ్మర మల్లారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.