బంజారాహిల్స్,జనవరి 6: రాష్ట్రంలో ఏడేండ్లుగా జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకున్న తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం వెంకటరమణ కాలనీ మహిళా మండలి భవనంలో నిర్వహించారు. 19మంది కల్యాణలక్ష్మి చెక్కులను, 11మందికి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజా రంజకమైన పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్న బీజేపీ నాయకులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెంకరమణ కాలనీ, పద్మావతికాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు ప్రారంభం
జూబ్లీహిల్స్ రోడ్ నం 47లో రూ.80లక్షలతో చేపట్టిన డ్రైనేజీ లైన్ నిర్మాణపనులను గురువారం ఎమ్మెల్యే దానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. రాష్ట్రంలో పేదల కోసం ఒకవైపు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రెండోవైపున అభివృద్ధ్దిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు.
జలమండలి అధికారులతో సమీక్ష
హిమాయత్‌నగర్ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.కాలనీలు, బస్తీల్లో మురుగు సమస్యల పరిష్కారం, తాగునీటి లైన్ల అప్‌గ్రేడ్ తదితర పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధ్దం చేసి తనకు అందిస్తే నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ జీఎమ్ సుబ్బారాయుడు, డీజీఎం సన్యాసిరావు, మహేందర్‌రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.