నాగర్ కర్నూల్ / భూత్పూర్ / ఊరుకొండ/ ఇటిక్యాల : శ్రీరామనవమి ఉత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) , సరితా దంపతులను, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని ( MLC Damodar Reddy) ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ అర్చక బృందంతో వేదమంత్రచరణల మధ్య క్రతువులు నిర్వహించారు. ఈసందర్భంగా శాసనసభ్యులు కూచూకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృప కటాక్షాలు నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, సుభిక్షంగా విరిజిల్లాలని ఆయన కోరారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు అందజేశారు. కాలనీ మాజీ కౌన్సిలర్ బాదం నరేందర్ సునీత, కొండూరు విజయభాస్కర్,లలిత దంపతులు స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో అర్చక బృందం కందడై శ్రీనివాసచార్యులు, చక్రవర్తి శ్రీనివాసచార్యులు, కరుణ శ్రీ విజయలక్ష్మి పద్మమ్మ వెంకట్రామన్, వేణుగోపాల్, మాడభూషి అజయ్ కుమార్ శర్మన్, శ్రీనివాసచార్యులు, హకీం సుదర్శన్, ఆకారపు విశ్వనాథం, ఎలిమే ఈశ్వరయ్య, అర్థం రవీందర్, శ్రీనివాసులు, మన్నెపురెడ్డి, మున్నూరు సంఘం అధ్యక్షులుతీగల సుభాష్, కార్యదర్శి పాలమూరు సతీష్, మున్నూరు సంగం యువత సభ్యులు, ఓం రక్ష కోలాట సభ్యులు, వివిధ మహిళా సంఘాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
భూత్పూర్ : శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఆదివారం శ్రీరామనవమి వేడుకలను సొంత గ్రామం అన్నసాగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో శ్రీరాముడు ఒక ప్రత్యేక దైవంగా భావిస్తారని తెలిపారు. రామాయణం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకుడు పవన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, గ్రామస్తులు ఆల శ్రీకాంత్ రెడ్డి, ఖాజా, రాజారెడ్డి, షాకీర్, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఊరుకొండలో..
ఊరుకొండ మండల పరిధిలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్య చంద్రారెడ్డి , సభ్యులు సత్యనారాయణ రెడ్డి , అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇటిక్యాలలో వైభవంగా రాములోరి కల్యాణం..
ఇటిక్యాల మండంలో బీచుపల్లి క్షేత్రంలోని కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు సుదర్శన్ నారాయణ్ శిష్యబృందం స్వామి వారి కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కుషా, డీఎస్పీ మొగిలయ్య వేడుకలను తిలకించారు.