పాన్‌గల్, నవంబర్ 24 : ఈ ఎన్నికల్లో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ సారథ్యంలోని సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్, కిష్టాపూర్ తండా, అన్నారం, దవాజీపల్లి, మాందాపూర్, చింతకుంట, మల్లాయిపల్లి, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేయాలని సూచించారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడడమే తప్పా ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ఆసరా, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసపు మాటలు నమ్మరాదని, వారిని నమ్మి ఓట్లేయరాదని తెలిపారు.
కారుగుర్తుకు ఓటేసి తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రూ.400లకే సిలిండర్, రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా, ఆసరా పింఛన్లు, రైతు బంధు రెట్టింపు చేయడంతోపాటు అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యంతో లంచాలు లేనిదే పనులు జరుగవని, అందుకే పనిచేస్తే వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. అనంతరం రేమద్దుల, చింతకుంట గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన 20మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దవాజీపల్లిలో గ్రామస్తులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌రావు, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, ఠాకూర్‌నాయక్, రవిరెడ్డి, సురేందర్‌గౌడ్, ప్రసాద్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, కథాల్, శివనాయక్, దామోదర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, దాసునాయక్, వీరసాగర్, సర్పంచ్ మేస్త్రీ రాము లు, ఉపసర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, నవంబర్ 24: జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతీ ఖర్చును లెకించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు బేరారామ్ చౌదరి అన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుల వివరాలపై భేరారామ్ చౌదరి రోజువారి అకౌంట్స్ రెండో విడుత తనిఖీని శుక్రవారం పరిశీలించారు. నామినేషన్లు వేసిన రోజు నుంచి గురువారం వరకు అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలను ఆ పార్టీ ఏజెంట్ల వద్ద ఉన్న వివరాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చుల నమోదులో తే డా రావద్దు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక అధికారి శ్యాం బాబు, సహాయ వ్యయ నోడల్ అధికారి జహంగీర్, పరిశీలకులు లైజన్ ఆఫీసర్ మ న్సూర్, అకౌంట్స్ బృందాల అధికారులు పాల్గొన్నారు.