చర్లపల్లి, జూలై 10 : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలోని అక్సికేర్ వైద్యశాలలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రాబిన్సన్ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించి ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలో సౌకర్యాలు కల్పించామని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.