హైదరాబాద్ : నిద్రిస్తున్న వ్యక్తిపై మరో వ్యక్తి బ్లేడుతో దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..అత్తపూర్ సులేమాన్ నగర్లో రెహానా అనే వ్యక్తి నిద్రిస్తుండగా మరో వ్యక్తి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. తనను ఫర్నిచర్ షాపులో పనిలోంచి తొలగించి రెహానాను పెట్టుకోవడంతో దుండగుడు ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లు తెసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Tamil Nadu | బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 18 మంది మృతి, ఆరుగురికి గాయాలు
Rythu Bhima | రైతు బీమాకు మంగళం..పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం