నిరుపేద మహిళకు మంత్రి కొప్పుల ఆపన్నహస్తం
నిరుపేద మహిళకు మంత్రి కొప్పుల ఆపన్నహస్తం | సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బారినపడ్డ ఓ తల్లిని నవ మాసాలు మోసి, కనిపెంచిన పిల్లలే పట్టించుకోలేని పరిస్థితుల్లో.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకొని చలించిపోయారు.

ధర్మారం : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బారినపడ్డ ఓ తల్లిని నవ మాసాలు మోసి, కనిపెంచిన పిల్లలే పట్టించుకోలేని పరిస్థితుల్లో.. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయించి, కరీంనగర్ దవాఖానలో చేర్పించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు. ధర్మారం దొంగతుర్తి గుండ గంగమ్మ పది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడింది. అప్పటి నుంచి దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక్కతే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉంటోంది. స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు నిత్యం భోజనం అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించింది.
గంగమ్మకు నలుగురు బిడ్డలు ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వారికి సమాచారం అందించగా.. ఎవరూ ముందుకు రాలేదు. చుట్టుపక్కల ఉన్న వారు సైతం పట్టించుకోలేదు. ఆమె పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పట్టారు. ఇది గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయించి, గంగమ్మను కరీంనగర్ దవాఖానకు తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకొని మహిళకు వైద్యసేవలందేలా చర్యలు తీసుకున్న మంత్రి ఈశ్వర్కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు
డీఆర్డీఓ మరో ముందడుగు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

