దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు | దేశంలో ఉధృతి తగ్గుతున్నది. వరుసగా రెండో రోజు రెండు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశంలో ఉధృతి తగ్గుతున్నది. వరుసగా రెండో రోజు రెండు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు వైరస్ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే, మరణాలు మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,73,790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. 45 రోజుల తర్వాత రోజువారీ కేసులు కనిష్ఠ స్థాయికి చేరాయి.
ఈ నెల మొదటల్లో నాలుగు లక్షలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం భారీగా తగ్గాయి. కొత్తగా 2,84,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 3,617 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కు పెరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 2,51,78,011 మంది బాధితులు కోలుకోగా.. మరో 3,22,512 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 22,28,724 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
టీకా డ్రైవ్లో 20,89,02,445 మందికి టీకాలు వేసినట్లు చెప్పింది. మరో వైపు జాతీయ రికవరీ రేటు 90.80శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 9.84శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.36శాతంగా ఉందని, వరుసగా ఐదు రోజూ పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా, మరణాలు రేటు 1.16శాతం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 20,80,048 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 34,11,19,909 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

