హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని మండలం యూనిట్‌గా కరువు మండలాల ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ సేకరించిన సమాచారాన్ని అందజేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైనచోట క్షేత్రస్థాయి పరిశీలనతో పంట నష్టాన్ని నిర్ధారించాలని పేరొన్నారు. కేంద్ర క్యాబినెట్ రబీ మారెటింగ్ సీజన్ 2027-28కు సంబంధించి కనీస మద్దతు ధరలను బుధవారం పెంచింది. ఈ నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించడంతో కేంద్రం బాధ్యత అయిపోదని, ఆ మద్దతు ధర ప్రతి రైతుకూ అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.