హైదరాబాద్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేస్తుందన్నారు.
కవిత పది కాలాల పాటు ప్రజాసేవలో కొనసాగుతూ.. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. కవిత నిండు నూరేళ్లు, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతున్ని ప్రార్థించారు.