ఖమ్మం, నవంబర్ 14: నేను ఇకడి వాడను, ఖమ్మం లోకల్ బిడ్డను.. ఇకడే ఉన్న.. ఇకడే ఉంటా.. నా ఇల్లు ఇకడే.. స్థానికేతరులకు ఖమ్మంలో స్థానం లేదు అని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్ధి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. 45వ డివిజన్ మామిళ్ళగూడెం నందు ఖమ్మం వెండి, బంగారం నగల సంఘం మాజీ అధ్యక్షుడు వెగ్గలం శ్రీనివాసరావు అధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అజయ్‌కుమార్ మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధిని కాంక్షించే వారికి మీ మద్దతు తెలపాలని కోరారు. ఖమ్మంపై నాకున్న తపన, కమిట్మెంట్ బయట నుంచి వచ్చిన వారికి ఉండదు అన్న విషయం ఆలోచించాలని కోరారు. సీఎం కేసీఅర్, కేటీఆర్ సహకారంతో రూ.2500 కోట్ల నిధులు తీసుకువచ్చి ఖమ్మంను అభివృద్ధి చేశానన్నారు. అభివృద్ధి ఇంకా కొనసాగాలి అంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్, జకుల లక్ష్మయ్య, విజయ్, గుమ్మడివెల్లి శ్రీను, గౌరోజు వసంత్, సుంకర నర్సింహారావు, నర్సింహాచార్యులు, దేశరాజు వేంకటేశ్వరరావు, సదానందచారి, ఇనుగుర్తి వేంకటేశ్వరరావు ఉన్నారు.
ఖమ్మం, నవంబర్ 14: అజయ్ అన్నా.. మీరు గతంలో మా ఇంటికి వచ్చి కల్యాణలక్ష్మి చెకు ఇచ్చారు. ఆ డబ్బులతో చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాను అని ఒక మహిళ ఆప్యాయంగా పువ్వాడను పలకరించింది. ఆ చెకు ద్వారా పెళ్లికి చేసిన అప్పులు తీర్చుకోగలిగా.. కేసీఅర్కు, అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 25వ డివిజన్ నందు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి అజయ్‌కుమార్ మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. అవ్వా పెన్షన్ వస్తుందా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు. నాయకులు చింతల రేణుక, గుజ్జర ప్రసాద్, జీడిమెట్ల వెంకన్న, ఆడపా సత్యనారాయణ, గార్ల వెంకటేశ్వర్లు, నాగిశెట్టి రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 15: వీవీసీ వెంకటరమణ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి వెంకటరమణ ప్రసాద్ జయంతి సందర్భంగా మమత రోడ్ నందు సంస్థ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్ ప్రారంభించారు.