ఆర్టీసీలో ప్రవళిక చట్టం ఎప్పుడు?
- నర్సాపూర్‌లో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి
- త్వరగా చట్టం తేవాలంటూ ఆర్టీసీ సిబ్బంది డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు ఆగడం లేదు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై ప్రయాణికులు, ఇతర వ్యక్తులు భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. బస్సు ఎకడ ఆపాలనే వివాదం నుంచి టికెట్, చిల్లర సమస్యల వరకు చిన్నపాటి కారణాలే దాడులకు దారితీస్తున్నాయి. కొన్నిచోట్ల ఉద్యోగులు తీవ్రంగా గాయపడుతుండగా.. మరికొన్ని ఘటనల్లో ప్రాణాలే పోతున్నాయి.
అయినా ఈ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మాత్రం ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై జరిగిన దాడి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రయాణికులను దించేందుకు బస్సు నిలిపిన సమయంలో వాహనాన్ని అడ్డంగా నిలిపి.. డ్రైవర్ నరేష్, కండక్టర్ శ్రీకాంత్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన స్థానిక మాజీ కౌన్సిలర్ రాజేందర్, ఇతరులపైనా దాడికి తెగబడ్డారు.
ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనందున నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు అధికారులకు సూచించారు. ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, ఉద్యోగులు కోరుతున్నది కేవలం ఖండనలు, భరోసాలు మాత్రమే కాదు.. విధి నిర్వహణలో తమపై దాడి చేస్తే నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రవళిక ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

