మహబూబ్‌నగర్ : గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. మంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసరగా.. మంత్రి చాలెంజ్‌ను స్వీకరించి వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.